ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన ధరలకు సినిమాలు ప్రదర్శించలేమని థియేటర్ల యజమానులు సినిమా హాళ్లను మూసివేశారు. ఓ వైపు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో సంక్రాంతి పండుగగకు విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.
అయితే ఈ తాజాగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఏపీలో టికెట్ల ధరలపై స్పందించారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశిస్తూ 10 ప్రశ్నలు సంధించారు. అయితే ఈ ప్రశ్నలపై మెగా బ్రదర్ నాగబాబు మద్దతు తెలపడం గమనార్హం. ఏపీ మంత్రికి ఆర్జీవీ 10 ప్రశ్నలతో కూడిన ట్విట్ చేశారు. అయితే ఈ ట్విట్‌ను నాగబాబు రీట్వీట్ చేస్తూ.. నువ్వు చెప్పింది అక్షరాలా నిజమన్నారు. అంతేకాకుండా నాగబాబు అడుగుదామనుకున్న ప్రశ్నలనే ఆర్జీవీ అడిగారంటూ వెల్లడించారు.