సాహితి, తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 24 ఆనారోగ్యంతో కిమ్స్ ఆసుపత్రిలో చేరిన సిరివెన్నల సీతారామశాస్త్రి ఈ రోజు సాయంత్రం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో, మా అధ్యక్షుడు మందు విష్ణు స్పందిస్తూ… నా టీనేజ్ లైఫ్ మొత్తాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వ్యాఖ్యలు నన్ను ప్రభావితం చేశాయి.
నాలాంటి చాలామందిని ఇన్‌స్పైర్ చేసేలా ఎన్నో పాటలు రాసారు. ఈ రోజు ఆయన మరణ వార్త నా మనసుని కలచివేసింది. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగానే కాక తెలుగు సినీ, సాహితీ లోకానికి తీరని లోటు. ఈ విషాద సమయంలో నా తరుపున మా అసోసియేషన్ తరుపున వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.