NTV Telugu Site icon

సినిమాటోగ్రాఫ‌ర్ రాంప్ర‌సాద్ కు మాతృవియోగం

ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ రాంప్ర‌సాద్ మాతృమూర్తి సుబ్బ‌ల‌క్ష్మి (75) చెన్న‌య్ లో క‌న్నుమూశారు. ప్ర‌ముఖ మేక‌ప్ మేన్ మాధ‌వ‌రావు స‌తీమ‌ణి ఆమె. తెలుగు చిత్ర‌సీమ‌లో సీనియ‌ర్ మేక‌ప్ మేన్ గా మాధ‌వ‌రావు పేరు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ద‌శాబ్దాల పాటు న‌టుడు కృష్ణ‌కు ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ మేన్ గా వ్య‌వ‌హరించారు. మాధ‌వ‌రావు, సుబ్బ‌లక్ష్మి త‌న‌యుడు రాంప్ర‌సాద్ సైతం యాబైకు పైగా తెలుగు సినిమాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌హ‌రించారు. సుబ్బ‌లక్ష్మి చెన్న‌య్ లోని స్వ‌గృహంలో క‌న్నుమూశార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. దీంతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు.