తొలి సినిమా ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు బుచ్చిబాబు. బుచ్చిబాబు ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు. 20న జూనియర్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు చేసిన ట్వీట్ లో అది క్లియర్ కట్ గా అర్థం అవుతోంది. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రెండు ప్రాజెక్ట్ లను ఫిక్స్ చేశాడు ఎన్టీఆర్. అందులో ఒకటి కొరటాల దర్శకత్వంలో కాగా మరోటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో. అయితే ఆ రెండింటి తర్వాత బుచ్చిబాబు సినిమా ఉంటుందంటున్నారు. తన ట్వీట్ లో బుచ్చిబాబు ‘లెట్స్ క్రియేట్ ట్రెండ్. టెల్లింగ్ లోకల్ స్టోరీ గ్లోబల్లీ’ అని పేర్కొన్నాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్న ఎన్టీఆర్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకనే బుచ్చిబాబు ఈ ట్వీట్ చేసినట్లు అర్థం అవుతుంది. 2022లో ఎన్టీఆర్ కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉంటాడు. బుచ్చిబాబు సినిమా 2023లోనే ఉంటుందనేది అర్థం అవుతోంది. మరి అప్పటి వరకూ బుచ్చిబాబు ఖాళీగా ఉంటాడా? లేక మరో హీరోతో ముందుకు వెళతాడా? అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
‘ఉప్పెన’ దర్శకుడితో ఎన్టీఆర్
