NTV Telugu Site icon

లిప్ లాక్ కోసం అనుపమకి అరకోటి!?

సంక్రాంతికి విడుదలైన ‘రౌడీ బాయ్స్’ డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. దీనికి కారణం అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ బ్యూటీ ఈ సిమాలో లిప్ లాక్స్ తో చెలరేగింది. ప్రస్తుతం ఈ లిప్-లాక్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ ఇంతలా రెచ్చిపోని ఈ బ్యూటీ ఇప్పుడు హద్దులు దాటి కొత్త హీరోతో రొమాంటిక్ సీక్వెన్స్‌లో రెచ్చిపోవడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అయితే దీనికోసం అనుపమ భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. కొత్తహీరోతో జతకట్టడంతో పాటు లిప్ లాక్స్ ఇకి ఓకే చెప్పినందుకు అనుపమ తన పారితోషికంగా అరకోటిని వసూలు చేసినట్లు సమాచారం.

నిజానికి దీనికి ముందు అనుపమ నటించిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. దీంతో అనుపమను పలకరించే దర్శకనిర్మాతలే కరువయ్యారు. అయినా బడ్జెట్ విషయంలో పక్కా ప్లాన్ తో ఉండే దిల్ రాజు అనుపమకి భారీ పారితోషికం ఇవ్వటానికి తన వారసుడిని ఎలాగైనా నిలబెట్టాలనే తపనే కారణం అంటున్నారు. మరి ఈ రిస్క్ ఫ్యాక్టర్ అనుపమకి ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

Show comments