హుజూర్ నగర్ లక్కవరంలో వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రాంగణం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాయకుడు ఏపురి సోమన్నపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. వైఎస్సార్‌టీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ దాడిని ఖండిస్తూ.. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ షర్మిల ఫిర్యాదు పత్రాన్ని అధికార ప్రతినిధి సత్యవతి పోలీసులకు అందించారు. వర్షం పడుతున్నా సరే, దీక్ష విరమించకుండా షర్మిల కొనసాగిస్తున్నారు. దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేసేదాకా దీక్ష విరమించేదేలేదని తేల్చి చెప్పారు. నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళ్ల ముందు దాడి జరుగుతుంటే, చర్యలు తీసుకునేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అంటూ షర్మిల నిలదీశారు.
ఇదిలావుండగా.. ఇంతకుముందు జాబ్ నోటిఫికేషన్ కోసం వైఎస్ షర్మిల 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే! దీనికి కొనసాగింపుగా ఆమె ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహర దీక్ష ఆందోళనను చేపట్టారు. ఎంపిక చేసిన జిల్లాలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తూ వస్తోన్నారు. ఈ క్రమంలోనే హుజూర్ నగర్ లక్కవరంలో దీక్ష చేపట్టగా.. అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతలు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
