Site icon NTV Telugu

తెలంగాణ నా గడ్డ : వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila

మొదటి సారిగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన వైఎస్‌ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ స్థాపించామని… వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వ్యతిరేకి అవునా, కాదా అనేది గ్రామాల్లో తెలుసుకోవాలన్నారు. వైఎస్సార్ తెలంగాణకు వ్యతిరేకి కాదని… ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారని గుర్తు చేసిన షర్మిల…యూపీఏ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు అంశం చేర్చారని తెలిపారు. మేము తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పలేదని…ఇది నా గడ్డ.. దీనికి మేలు చేయడానికి వచ్చానని స్పష్టం చేశారు.

read also : నందిగామ వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడి తీరుపై చర్చ!!

పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరని… తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని… వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఈ పార్టీ స్థాపించామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వంపై వైఎస్‌ షర్మిల చాలా ఘాటుగానే స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రాజన్న రాజ్య తీసుకురాకపోతే.. కచ్చితంగా వచ్చే ఎలక్షన్స్‌ లో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి ఓటమి తప్పదని వైఎస్‌ షర్మిల చురకలు అంటించారు. ప్రస్తుతం ఏపీలో రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్లుటే కనిపిస్తుందన్నారు షర్మిల. వైఎస్సార్ చనిపోయిన తర్వాత మా గతి ఏమౌతాయి అని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని… తెలంగాణ ప్రజలను వైఎస్సార్‌ గుండెల్లో పెట్టుకుని చూశారన్నారు.

Exit mobile version