యాదాద్రిలో ఇక స్వామివారి సేవలు మరింత ప్రియం కానున్నాయి… లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆర్జిత సేవా టికెట్ల ధరలను పెంచేశారు… లక్ష్మీనరసింహస్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజల టిక్కెట్ల ధరలను ఏకంగా 50 శాతానికి పైగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ అధికారులు… ఇక, తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకున్న ధరలు ఈ నెల 10వ తేదీ నుంచి అమలులోకి రాబోతున్నాయి.. యాదాద్రిలో భక్తులు మొక్కు, శాశ్వత కైంకర్యాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ కాగా.. పెరిగిపోతోన్న ధరలు, ఉద్యోగులు జీతభత్యాలు, ఆలయ అభివృద్ధికి భక్తుల నుంచి వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో.. ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టారు అధికారులు..
Read Also: వ్యవసాయ మంత్రి బహిరంగ లేఖ.. యాసంగిలో వరి వద్దు..
లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంతో పాటు, కొండపైన రామలింగేశ్వరుడి, పాతగుట్ట ఆలయంలో కూడా భక్తుల నిర్వహించి సేవా రుసుములు, నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలు, నివేదనలు, భక్తులకు విక్రయించే ప్రసాదాల ధరలు కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పునర్ నిర్మాణాన్మి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేస్తోంది.. దీంతో.. యాదాద్రి రూపురేకలు పూర్తిగా మారిపోయాయి. క్రమంగా భక్తుల తాకిడి కూడా పెరుగుతూ వస్తోంది.. ఆలయ పునర్ ప్రారంభం వచ్చే ఏడాది జరగనుండగా.. ఆ తర్వాత భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.