Site icon NTV Telugu

Pesticide: వంటనూనె అనుకుని పురుగుల మందుతో వంట.. మహిళ మృతి

Prepare Food With Pesticide

Prepare Food With Pesticide

Pesticide: ఇల్లాలి పొరపాటు వల్ల తన ప్రాణమే పోయింది. ఓ మహిళ వంట నూనె అనుకుని పురుగుల మందుతో కూర చేసిన ఘటన ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెంలో చోటుచేసుకుంది. తాను మొదటగా తిన్న మహిళ.. అనంతరం తన భర్త, కూతురికి వడ్డించింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Kodali Nani: అమ్మాయిల్ని అడ్డం పెట్టుకొని.. టీడీపీ కుట్రలు పన్నుతోంది

37 ఏళ్ల వయస్సు గల బండ్ల నాగమ్మ అనే మహిళ గురువారం రోజు కూడా ఎప్పట్లాగే వంట చేసింది. అయితే వంట నూనె అనుకుని దాని పక్కనే ఉన్న పురుగుల మందును కూరలో వేసింది. వంట పూర్తి కాగానే తాను తినేసింది. ఆ తర్వాత పొలం వద్ద పనిచేస్తున్న భర్త పుల్లయ్యకు భోజనాన్ని తీసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న కొంతమేరకు తిన్నాడు. పురుగుల మందు వాసన రావడంతో కూతురు పడేసింది. వెంటనే భార్యాభర్తలు నాగమ్మ, పుల్లయ్యలను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నాగమ్మ ఆస్పత్రిలో మృతి చెందగా.. పుల్లయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నాగమ్మకు మతి స్థిమితం సరిగా ఉండదని అందుకే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు

Exit mobile version