NTV Telugu Site icon

Beauty Parlar: అందం కోసం బ్యూటీ పార్లల్ వెళితే.. బట్టతల చేసారు..!

Buty Parlel

Buty Parlel

Beauty Parlar: అందానికి అద్దంగా మారడం ఒక అమ్మాయికే సొంతం. ముఖానికి పసుపు రాసుకుని జుట్టుకు కుంకుడుకాయ రసంతో స్నానం చేస్తే ఆమెరుపే వేరు. అలాంటి అందాన్ని వదిలేసి ఇప్పటి యువతులు బ్యూటీ పార్లర్లపై పడ్డారు. ముఖానికి, జుట్టుకు రకారకాల కాస్మిటిక్ లు వాడుతూ తమ అందాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. బతకడానికి కాకుండా అందం కోసం బ్యూటీ పార్లర్లను నమ్ముకుని దానికి ఎడిక్ట్ అవుతున్నారు. అయితే కాస్మిటిక్ వాడి చాలా మంది అందవికారంగా మారిన దాఖలాలు కూడా వున్నాయి. కొందరు అందం కోసం రకారకాల క్రీములు బ్యూటీ పార్లర్లలో ఉపయోగించడం వల్ల అందాన్ని పోగొట్టుకుని లబోదిబో మంటున్నా మనం మాత్రం బ్యూటీ కోసం పార్లర్లలనే నమ్మకుంటున్నారు. ఒక అమ్మాయి తన అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు తన జుట్టును అందంగా ఒక షేప్ లో కత్తిరించాలని అనుకుంది. దానికోసం బ్యూటీ పార్లర్ల్ వెల్లింది. అయితే అక్కడ వెల్లిన అమ్మాయికి కథ అడ్డం తిరిగింది. ఎందుకంటే బ్యూటీ పార్లర్ లో ఆమె జుట్టుకు ఒక ఆయిల్ రాయడంతో జుట్టు ఊడిపోయింది. దీంతో ఆ యువతి, తన భర్త లబోదిబో మంటూ పోలీసులకు ఆశ్రయించిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

Read also: Skanda: డాన్స్ తో దిమ్మతిరిగే బొమ్మ చూపించారు…

ఓ వ్యక్తి తన భార్యను మోడల్‌గా చూడాలనుకుంటున్నాడు. భర్త కోరిక తీర్చేందుకు భార్య సిద్ధమైంది. యూసఫ్ గూడ కు చెందిన ఓ మహిళ ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరాగల్లి లైన్ లో ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. తనను అందంగా తీర్చిదిద్దాలని, హెయిర్ స్టైలిష్ గా తీర్చిదిద్దాలని బ్యూటీపార్లర్ నిర్వాహకులను కోరింది. అందుకే వారు కొన్ని సూచనలు చేశారు. బ్యూటీషియన్ చెప్పినట్లు పొడవాటి జుట్టు కత్తిరించుకుంది. ఆ తర్వాత వెంట్రుకలకు నూనె రాస్తారు. ఇక తను అందంగా తయారవుతోందన్న ఆనందంలో ఆ మహిళ పొంగిపొర్లడంతో అంతా తలకిందులైంది. బ్యూటీషియన్ చెప్పినట్లు టీమ్ కి ట్రీట్ మెంట్ తీసుకుంటే.. ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతాయి. ఆయిల్‌తో మసాజ్ చేసిన తర్వాత జుట్టు మొత్తం గుబ్బలుగా రాలిపోవడంతో బాధితురాలు షాక్‌కు గురైంది. భార్య వెంట్రుకలు ఊడిపోవడం చూసి భర్త షాక్ అయ్యాడు. దంపతుల మధ్య గొడవలు జరిగాయి. బాధితురాలు ఊడిపోయిన జుట్టు తీసుకుని నేరుగా అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. బ్యూటీపార్లర్ నిర్వాకం వల్ల తన జుట్టు రాలిపోయిందని, భర్తతో గొడవ పడ్డానని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
OMG 2: భక్తుడిని కాపాడుకోవడానికి శివుడే దిగొచ్చాడు…

Show comments