Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. నేడు భారత్‌-అస్ట్రేలియా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. ఖనిజాల రంగంలో భారత్‌-అస్ట్రేలియా మధ్య ఎంవోయూ.
  2. నేడు ఏపీ అసెంబ్లీలో పలు సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ ప్రగతిపై నేడు స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు.
  3. నేడు నిజామాబాద జిల్లాలోని బోధన్‌ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. అయితే బీజేపీ బోధన్‌ బంద్‌కు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. ఎవరూ షాపులు మూసివేయవద్దని పోలీసులు తెలిపారు.
  4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,300లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.72,300లుగా ఉంది.
  5. నేడు ఏపీ సీఎం జగన్‌తో ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థులు భేటీ కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు విద్యార్థులతో సీఎం జగన్‌ సమావేశం కానున్నారు.
  6. నేడు కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హజరుకానున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై పోరుబాట, పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.
Exit mobile version