1. ఐపీఎల్ సీజన్ 2022లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ముంబై వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
2. నేటి నుంచి కేసీఆర్ జాతీయ పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు కేసీఆర్ టూర్ కొనసాగనుంది. వీర మరణం పొందిన సైకి కుటుంబాలకు, రైతు ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించున్నారు.
3. నేడు దావోస్‌కు ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నేడు ఉదయం 7 గంటలకు సీఎం జగన్ బయల్దేరనున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు ఎకనామిక్ పోరం సదుస్సు జరుగనుంది. ఈ సదస్సులో ఏపీ సీఎం జగన్ పాల్గొంటారు.
4. దిశ ఎన్‌కౌంటర్‌పై నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. దిశ ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్‌కర్ కమిషన్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. జనవరిలో సుప్రీకోర్టుకు సిర్పూర్‌కర్ కమిషన్ నివేదిక ఇచ్చింది.
5. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300లు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,510లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.65,400లుగా ఉంది.
