NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు ఐపీఎల్‌ సీజన్‌ 2022లో భాగంగా బెంగళూరు జట్టుతో గుజరాత్‌ జట్టు తలపడనుంది. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియం దేదిక ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

2. తెలంగాణలో నేడు ఆటోలు, క్యాబ్‌లు బంద్. వెహికల్‌ చట్టం 2019ను నిలిపివేయాలంటూ డ్రైవర్స్‌ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు బంద్‌ నిర్వహించనున్నారు.

3. నేడు ఆటోలు, క్యాబ్‌ల బంద్‌ దృష్ట్యా.. అర్థరాత్రి నుంచి ప్రత్యేక బస్సలను టీఎస్‌ ఆర్టీసీ నడుపుతోంది. ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను నడుపనున్న ఆర్టీసీ.

4. నేడు హైదరాబాద్‌లో ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ను డ్రైవర్స్‌ జేఏసీ నేతలు ముట్టడించనున్నారు.

5. నేడు ఏపీలో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంబులెన్స్‌లను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.

6. నేడు ఉదయం 11 గంటలకు విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. నాడు-నేడు పనుల పురోగతి, ఇతర అంశాలపై చర్చించనున్నారు.

7. నేటితో రాజ్యసభ ఉప ఎన్నిక నామినేషన్‌ గడువు ముగియనుంది. అయితే.. నేడు రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థిగా గాయత్రి రవి నామినేషన్‌ వేయనున్నారు.

8. నేడు హైదరాబాద్‌లో తెలుగు సినిమా పరిశ్రమ సమావేశం కానుంది. ఈ సందర్భంగా దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

9. జ్ఞాన్‌వాపి కేసులో నేడు వారణాసి కోర్టలో నివేదికను కోర్టు కమిషనర్‌ విశాల్‌ సమర్పించనున్నారు.

10. నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ప్యాపలి మండలంలోని జలదుర్గంలో ఈ సందర్భంగా చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొంటారు.

11. నేటి నుంచి తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు అమలులోకి రానున్నాయి. బీర్‌, క్వార్టర్‌కు రూ.20, పుల్‌బాటిల్‌కు రూ.40 చొప్పున పెంపు వర్తించనుంది.