NTV Telugu Site icon

బలపడుతున్న అల్పపీడనం.. రాగల కొన్ని గంటల్లో!

ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల కొన్ని గంటల్లో వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఉత్తర – వాయువ్య దిశగా కదిలి బలపడి మే 24 నాటికి తుపానుగా, తరువాతి 24 గంటల్లో అతి తీవ్రమైన తుపానుగా మారనుంది. దీంతో.. తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ తెలంగాణలో ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.