Site icon NTV Telugu

Weather: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు.. 40 డిగ్రీలు దాటనున్న ఎండలు

Wether

Wether

Weather: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంపై ఆగ్నేయ దిశ నుంచి అల్పపీడనంగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ పెరిగే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, రేపటి నుంచి రాష్ట్రంలోని పలు చోట్ల 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది’’ అని వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలు. గాలిలో తేమ 42 శాతం నమోదైంది.

Read also: Bhakthi TV : బుధవారం నాడు ఈ స్తోత్రాలు వింటే మహా పంచపాతకాలు తొలగిపోతాయి

ఇక ఏపీలో 32 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. ముఖ్యంగా అనకాపల్లి, అల్లూరి, మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏడు మండలాల్లో విపరీతమైన వేడి గాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు కనిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్‌ను తాకవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనకాపల్లి జిల్లాలోని ఐదు మండలాలు, తూర్పుగోదావరిలోని రెండు మండలాలు, కాకినాడలోని ఆరు మండలాలు, పార్వతీపురం జిల్లాలోని ఆరు మండలాల్లో కూడా వడగళ్ల వానలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
Bhakti TV : నేడు శ్రీ లక్ష్మీనృసింహ స్వామి స్తోత్ర పారాయణం చేస్తే సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయి

Exit mobile version