NTV Telugu Site icon

Fake Challan: వరంగల్ జిల్లాలో నకిలీ చలాన్ల గుట్టురట్టు.. సూత్రధారి బ్యాంక్ క్యాషియర్!

Fake Challan Case

Fake Challan Case

Fake Challan Case: వరంగల్ జిల్లాలో నకిలీ చలాన్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఎక్సైజ్ సీఐ ఫిర్యాదుతో అసలు భాగోతం బయటపయలైంది. ఆబ్కారీ శాఖకే కేటుగాళ్ళు మస్కా కొట్టారు. నకిలీ చాలన్లతో 11 మంది నిందితులు టెండర్లు వేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎక్సైజ్ సీఐ పవన్ ఫిర్యాదుతో నకిలీ చాలన్ల భాగోతం బయటబయలైంది. అప్పట్లో లైసెన్స్ రెన్యువల్ కోసం కోటి రూపాయలకు పైగా నకిలీ చాలన్లు దుండగులు సృష్టించారు. నిందితుల్లో అసలు సూత్రధారిగా బ్యాంక్ క్యాషియర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మరో 22 లక్షల రూపాయల నకిలీ చాలన్లు బయటపడ్డంతో తీవ్ర కలకలం రేపుతుంది. 2019 -2021 వైన్ షాప్ టెండర్ల కోసం నిందితులు నకిలీ చాలన్లు వాడారని పోలీసులు దర్యాప్తులో తేలింది.

Read also: Robbery Case: వనస్థలిపురం దోపిడీ కేసులో ట్విస్ట్… 2కోట్లు కాదట..!

ప్రస్తుత ఘటనలోనూ సూత్రధారిగా బ్యాంక్ క్యాషియర్ ఉండటం వరంగల్‌ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. నకిలీ చాలన్లతో టెండర్ల ఘటనలో వర్ధన్నపేట పోలీసులు 11మందిపై కేసు నమోదు చేసారు. 11 నిందితులను పోలీసుల అదుపులో తీసుకున్నారు. అయితే బ్యాంక్ క్యాషియర్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే.. బ్యాంకులో డబ్బులు జమ చేయకుండానే బ్యాంకు ఉద్యోగుల సహకారంతో రశీదులపై స్టాంప్ వేయించి ఎక్సైజ్ అధికారులకు అప్పట్లో సమర్పించారు. అయితే.. బ్యాంకులో డబ్బులు జమ చేయకుండానే బ్యాంకు ఉద్యోగుల సహకారంతో రశీదులపై స్టాంప్ వేయించి ఎక్సైజ్ అధికారులకు అప్పట్లో సమర్పించారు. కాగా.. ఈ విషయాన్ని ఆలస్యంగా ఎక్సైజ్ అధికారులు ర్తించారు. ఈ కేసును పోలీసులు విచారించగా.. నకిలీ చలాన్ల కేసుతో సంబంధం ఉన్న 11 మందిని అదుపులో తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈఘటనపై తీవ్ర ఉత్కంఠంగా మారింది.