రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయానికి అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి అని వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తెలిపారు. బల్దియా కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన కమిషనర్ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ లను ఏర్పరు చేసారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయానికి అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ లు ఆదేశించారు. నగరంలోని జలమయమైయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలకు సమీపంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు సత్వర సహాయం అందించడానికి బల్దియా కార్యాలయంలో కంట్రోల్ రూమ్1800 425 1980 టోల్ ఫ్రీ, 9701999645 మొబైల్, 7997100300 వాట్స్ అప్ నంబర్ లతో ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
ఈ నంబర్లను సద్వినియోగించుకొని సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే ప్రజల కు ఇబ్బందులు కలుగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
సమస్యలకు సంబంధించిన ఫోటో లను వాట్సాప్ నకు పంపి,ఆ ప్రాంతం ఏ డివిజన్ లోని ప్రాంతంలో ఉందొ కూడా తెలియజేస్తే బల్దియా డి.ఆర్.ఎఫ్.సిబ్బంది, అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని వారు అన్నారు.