Site icon NTV Telugu

Warangal: వరంగల్‌లో ఎస్సై వీరంగం.. రెస్టారెంట్‌లో మహిళపై దాడి

Si

Si

వరంగల్‌లో ఓ ఎస్సై రెచ్చిపోయాడు. మహిళ అని కూడా చూడకుండా దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదేం దారుణం అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Online Payment: 2 కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన ఆన్‌లైన్ పేమెంట్.. చివరికిలా..!

మిల్స్ కాలనీ స్టేషన్‌కు సంబంధించిన ఎస్సై శ్రీకాంత్ అర్ధరాత్రి వరంగల్ ఫోర్ట్ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌కు వచ్చాడు. వచ్చీరాగానే హోటల్‌ నిర్వాహకులపై దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా మహిళ చెంప చెళ్లుమనిపించాడు. అక్కడే ఉన్న మగవాళ్లపై కూడా శ్రీకాంత్ దాడికి పాల్పడ్డాడు. ఎస్సై దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అయితే బాధిత మహిళ మిల్స్ కాలనీ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైపై ఫిర్యాదు చేసింది. తనపై అన్యాయంగా దాడి చేశాడంటూ కంప్లంట్ ఇచ్చింది. ఏదైనా తప్పు జరిగితే జరిమానా విధించాలి.. లేదంటే మూసేమని చెప్పాలి కానీ.. ఇలా మహిళపై దాడి చేయడమేంటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Krishnamohan Reddy: టెక్నికల్‌గా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. స్పీకర్ నోటీసుపై గద్వాల ఎమ్మెల్యే ప్రకటన

Exit mobile version