NTV Telugu Site icon

Warangal Student: జీవో 55ను రద్దు చేయాలి.. వరంగల్ అగ్రికల్చర్ విద్యార్థుల నిరసన

Warangal Students

Warangal Students

Warangal Student: హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ప్రేమావతిపేట సమీపంలో భూమిని మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం జీవో 55ని కూడా జారీ చేసింది. అయితే దీనిపై విద్యార్థులు నిరసనలు వెల్లువెత్తు తున్నాయి. జీవోను రద్దు చేయాలని ఆందోళన చేపడుతున్నారు. ఈనేపథ్యంలో.. వరంగల్ జిల్లా హైకోర్టుకు వ్యవసాయ యూనివర్సిటీ భూములు ఇవ్వడాన్ని వెతిరేకిస్తూ ఆరెపల్లి అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జీవో 55 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ లోని ఆరెపల్లి వ్యవసాయ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్తు తరాలకు వ్యవసాయ పరిశోధనలు ఎంతో ఉపయోగ పడతాయని విద్యార్థులు తెలిపారు. వ్యవసాయ రంగానికి భూములు ఇవ్వాల్సిన ప్రభుత్వమే లాక్కోవడం అన్యాయమన్నారు. మా ప్రో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామన్నారు. దానికోసం ఎంతవరకైనా పోరాడుతాం వరంగల్ అగ్రికల్చర్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

Read also: Mudragada: వైసీపీపై ఇంట్రెస్ట్‌ లేదు..! టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ.. క్లారిటీ ఇచ్చిన గిరిబాబు

హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల స్థలం బుద్వేల్ గ్రామంలోనే ఉంది. ఇక్కడ 1966లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి 2,500 ఎకరాలు కేటాయించింది. అయితే దీనిపై రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ముందు ఏబీవీపీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.. విశ్వవిద్యాలయంకు సంబంధించిన 100 ఎకరాల స్థలాన్ని హైకోర్టుకు మంజూరు నిరసన వ్యక్తం చేశారు. పరిపాలన భవనం ముందు విద్యార్థుల బైటాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. తక్షణమే హైకోర్టుకు మంజూరు చేసిన GO ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్న విద్యార్థులు. వ్యవసాయ విశ్వవిద్యాలయం కు సంబంధించిన స్థలంలో ఒక్క గజం కూడా ఇవ్వడానికి వీలులేదన్నారు. హైకోర్టు నిర్మాణ ప్రతిపాదనను వేరే చోటుకు మార్చాలని హెచ్చరించారు. రాజేంద్రనగర్ యూనివర్సిటీ భూములను అమ్ము కుంటున్నరని మండిపడ్డారు. గతంలో వీసీ పని చేసిన అధికారి పలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
Election of Two MLC Seats: రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ