NTV Telugu Site icon

Tragedy: మేడ్చల్ లో గోడకూలి ఏడుగురు మృతి.. సికింద్రాబాద్ లో కొట్టుకొచ్చిన మృతదేహాలు..

Medchel Tragery

Medchel Tragery

Tragedy in Medchal: మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయింది. అయితే అక్కడే వున్న కూలీలపై నిర్మాణంలో వున్న గోడ కూలడంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. నిన్న (మంగళవారం) అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. కూలిన గోడ శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. బాచుపల్లి లో నూతనంగా నిర్మాణమవుతున్న హరిజాన్ కన్స్ట్రక్షన్ లో రోజూ కూలీలుగా పనిచేస్తున్నారని స్దానికులు తెలిపారు.

Read also: Parth Jindal Angry: కోపంతో ఊగిపోయిన ఢిల్లీ ఓనర్ పార్త్ జిందాల్.. వీడియో వైరల్!

ఒక్కసారిగా ఈదురుగాలులతో పెద్ద వర్షం పడేసరికి హరిజాన్ వెంచర్ చుట్టూ ఉన్న ప్రహరీగోడ, ఇనుప రేకులు కూలిపోయి గోడకు ఆనుకొని ఉన్న గుడిసెలుపై పడటంతో నలుగురుకి గాయాలైయ్యాయని తెలిపారు. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు‌ కేసు నమోదు చేసుకొని‌ దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో ఓ మహిళ, నాలుగేళ్ల బాలుడు ఉన్నారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను తిరుపతిరావు, శంకర్, రాజు, రామ్ యాదవ్, గీత, హిమాన్షు, ఖుషిగా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read also: Maldives- India Tension: రేపు భారత్కు మాల్దీవుల విదేశాంగ మంత్రి.. ఎందుకో తెలుసా..?

మరోవైపు సికింద్రాబాద్ -బేగంపేట్ ఓల్డ్ కస్టమ్ బస్తీలో రెండు చోట్ల నాల వరదనీటిలో మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. దీంతో స్థానికులు బేగంపేట పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను చూసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. మృతదేహాలు కుళ్ళిన స్థితిలో ఉండడంతో బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Show comments