NTV Telugu Site icon

MLA Laxma Reddy: ప్రచారం చేసినా ప్రయోజనం లేదు.. మా ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకే..

Lakshma Reddy

Lakshma Reddy

MLA Laxma Reddy: జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచార జోరును పెంచారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇందుకు నిదర్శనమే కురువగడ్డపల్లి గ్రామస్తులంతా ఆయనకు అండగా నిలవడం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కురువగడ్డపల్లి గ్రామస్తులంతా అభివృద్ధికి పట్టం కట్టేందుకు నడుం బిగించారు. మా ఊరిలో ఇతర పార్టీల వాళ్లు ప్రచారం చేసినా ప్రయోజనం లేదని, మా ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకే అని కుర్వగడ్డపల్లి గ్రామస్తులు తీర్మానం చేశారు. మా మద్దతు జడ్చర్ల నియోజకవర్గ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికే ” అంటూ ప్రచారం చేపట్టారు. గత 9 ఏళ్లలో తమ గ్రామంతో పాటు మండలం, నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనించిందని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అర్హులకు మంచిగా అందుతున్నాయని అన్నారు. అందుకే తామంతా బిఆర్ఎస్ పార్టీకే మరోసారి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇతర పార్టీల వారు తమ గ్రామంలో ప్రచారం చేసిన దండగే అని మంచి చేస్తున్న ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభివృద్ధిపై ఫెక్సీని ఏర్పాటు చేసి, సభలో ఆయన చేసిన అభివృద్ధిని తెలుపుతూ ముందుకు సాగుతున్నారు.

మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన కొందరు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.. గత పదేళ్ళలో మసిగుండ్లపల్లి గ్రామం చాలా మారిందని.. రోడ్డు, డ్రైనేజీలతో పాటు గ్రామం అభివృద్ధి చెందిందని పార్టీ మారిన నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పథకాలకు అభివృద్ధికి ఆకర్షితులయ్యే పార్టీలో చేరుతున్నట్లు మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. తమ గ్రామంతో పాటు, నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. ఇంతటి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని బీఆర్ఎస్ లో చేరినట్లు వారు చెప్పారు. రానున్న ఎన్నికల్లో లక్ష్మారెడ్డికి లక్ష మెజార్టీ అందించే దిశగా ప్రతి ఒక్కరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
Ambati Rambabu: చికిత్స కోసం మాత్రమే చంద్రబాబుకు బెయిల్.. నిర్దోషి అని కాదు..!