NTV Telugu Site icon

DK Aruna: నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా..?

Dk Aruna

Dk Aruna

DK Aruna: నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా..? అని బీజేపీ ఎంపీ డీకె అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ లగచర్ల పర్యటనలో ఉద్రిక్రత వాతావరణం నెలకొంది. లగచర్ల కు వెళుతున్న డీకే అరుణను మన్నెగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను ఎంపీగా నా నియోజకవర్గంలో పరామర్శించొద్దా..? అని మండిపడ్డారు. నేను ఎంపీనీ.. నేను ఏ తప్పు చేశానని అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి వల్లే జిల్లాలో లా & ఆర్డర్ సమస్య వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జిల్లా కలెక్టర్ ను కలిసేందుకు వెళ్తున్నామని అన్నారు. తాను నా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందన్నారు. తన‌ సొంత నియోజకవర్గంలో లా & ఆర్డర్ కంట్రోల్ చేసుకోలేక పోయారన్నారు.

Read also: Bulldozer Action : ఇకపై అధికారులు బుల్డోజర్‌ ఉపయోగించాలంటే ఆలోచించాల్సిందే.. లేకపోతే భారీ జరిమానా తప్పదు

మేము ఏమైనా లా & ఆర్డర్ బ్రేక్ చేసే పని ఏమీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. కలెక్టర్ ను కలుస్తామని అపాయింట్మెంట్ ఉందన్నారు. సీఎం రెవంత్ రెడ్డి వల్ల లా & ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెఢ్డిని అరెస్ట్ చేయండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి వెళ్తే లా & ఆర్డర్ ప్రాబ్లమ్ రాదా..? అని పోలీసులకు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అన్నను పంపిస్తారు.. ఎంపీగా నేను వెళ్లకూడదా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేక్కడి దౌర్జన్యం.. రాష్ట్రంలో ఎంపీగా నా నియోజకవర్గంలో నేను పర్యటించొద్దా..? అన్నారు. తాను స్టేషన్ లోకి ఎందుకు వస్తాను, నేనేం తప్పు చేశానని భీష్మించుకుని రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సముదాయించిన అనంతరం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. ఘటన జరిగిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Komatireddy Venkat Reddy: దాడులకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేయడానికి వెనకాడం..

Show comments