NTV Telugu Site icon

Vikarabad Farmers: దుద్యాల మండలంలో ఉద్రిక్తత.. ఫార్మా భూ రైతుల ఆందోళన..

Vikarabad

Vikarabad

Vikarabad Farmers: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫార్మా భూ రైతులు ఆందోళన చేపట్టారు. రోటి బండ తండాలో కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడిని నిర్భందించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈనేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనను అదుపు చేసే యత్నంలో పోలీసులకు తాండావాసులకు వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా.. దుద్యాల మండలంలోని దుద్యాల లగచర్ల పోలేపల్లి గ్రామాలలో ఫార్మా ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయాన్ని సేకరించేందుకు నేడు ఆయా గ్రామాల రైతులతో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ హాజరు కానుండటంతో ఆందోళన చేసేందుకు రైతులు వచ్చారు. దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అవిటి శేఖర్ సమావేశానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి లగచర్ల వెళ్తుండగా రోటిబండ తాండలోని గిరిజన రైతులు ఆయనకు అడ్డుకున్నారు. ఆయనను దీనిపై ప్రశ్నించారు. దీంతో ఫార్మకు తమ భూములు ఇవ్వాలని డిమాండ్ చేయగా అగ్రహించిన రైతులు శేఖర్ పై దాడికి పాల్పడ్డారు. తాండలోని గ్రామ పంచాయతీ భవనంలో ఆయనను నిర్భందించారు. తమ భూములు తమకు కావాలని ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉదృతంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతుల ఆందోళనను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. బొంరాస్ పేట్ ఎస్ఐ అబ్దుల్ రాహుఫ్ రెండు చేతులు జోడించి ఆందోళన విరమించాలని రైతులను వేడుకున్నారు. అయినా రైతులు ఆగ్రహానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్తత కొనసాగుతుంది.
Hyderabad: అమీర్ పేట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు.. ఎక్స్పైర్ అయినా సర్టిఫికెట్స్ తో..

Show comments