Site icon NTV Telugu

రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేష్‌ ఇంటికి బెజవాడ పోలీసులు..

మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కుమార్‌ తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు.. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని పీవీ రమేష్ తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటికి వచ్చిన విజయవాడ పోలీసులు.. ఓ కేసులో భాగంగా విచారణకు రావాలంటూ నోటీసులు అందజేశారు.. రమేష్ కుమార్ తల్లిదండ్రులు వయసు 80 ఏళ్ల పైగానే ఉంటుంది.. ఈ నెల 22వ తేదీన పటమట పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు.. 2018లో రమేష్ కుమార్ సోదరుడిపై అండర్ సెక్షన్ 498ఏ, డీపీ act 3,4 కింద కేసు నమోదు కాగా.. ఆ కేసులో భాగంగా విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, సునీల్ కుమార్ తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రమేష్ కుమార్ తలిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ కుమారులను అల్లుడు సునీల్ కుమార్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు.

Read Also: అఖిలేష్‌ యాదవ్‌కు బిగ్ షాక్‌… బీజేపీలో చేరిన ములాయం కోడలు

Exit mobile version