NTV Telugu Site icon

Hyderabad Traffic: ప్రయాణికులు బిగ్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Uppal Cricket Match

Uppal Cricket Match

Hyderabad Traffic: ఐపీఎల్-2024లో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హోం టీం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

Read also: Warangal Airport: వరంగల్‌లో రీజియనల్ ఎయిర్ పోర్టు..?

బోడుప్పల్‌, చెంగిచర్ల, ఉప్పల్‌ వైపు నుంచి భగాయత్‌ లేఅవుట్‌ నుంచి నాగోల్‌ వైపు వచ్చే వాహనాలు, హెచ్‌ఎండీఏ లేఔట్‌ నుంచి బోడుప్పల్‌, చెంగిచర్ల ఎక్స్‌ రోడ్డు నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు, తార్నాక వైపు నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు తార్నాక వైపు వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు ట్రాఫిక్‌ మళ్లింపుకు అణుగునంగా ప్రయాణాలు కొనసాగించాలని కోరారు. పోలీసులకు ఇబ్బంది కలిగించకుండా వేరే మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించాలని తెలిపారు. ట్రాఫిక్‌ కు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు. పోలీసులకు ప్రయాణికులు సహకరించాలని తెలిపారు.
PM Modi: అవినీతికి అమ్మ కాంగ్రెస్… అభివృద్ధిని పట్టించుకోని జేఎంఎంపై మోడీ విమర్శలు