ప్రముఖ కవి సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన నాకు ఎంతో ఆత్మీయులు అని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సిరివెన్నెల సినిమా తన ఇంటి పేరుగా మార్చింది. సిరివెన్నెల లోని పాటలు తెలుగు సినిమా చరిత్రలో తెలుగు ప్రజలకు గుర్తుండిపోయే పాటలు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన గేయాల ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి గొప్పతనాన్ని చాటిచెప్పిన వ్యక్తి. 1997లో బీజేపీ జాతీయ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వారికి జాతీయస్థాయిలో యువ మోర్చా ఆధ్వర్యంలో యువ కళాకారుడిగా అవార్డును అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. వారితో అనేక సందర్భాల్లో వివిధ అంశాలపై చర్చించడం జరిగింది.
భారతమాత మహా హారతి కార్యక్రమం లో వారు పాల్గొనడం దేశ ఔన్నత్యాన్ని గురించి ప్రజలకు వివరిస్తున్నప్పుడు ప్రజలు ఎంతో శ్రద్ధగా విన్నారు. వారి పాటల ద్వారా తెలుగు సంస్కృతిని సాంప్రదాయాలను వివరించడంతో పాటు దేశభక్తిని,దైవ భక్తి ని ,ప్రబోధించడం ద్వారా ఒక మంచి వ్యక్తులుగా ప్రధానంగా యువత క్రమశిక్షణ కలిగి మంచి పౌరులుగా నడిచే విధంగా ఉండేది. సినీరంగంలో అనేక అవార్డులను, నంది అవార్డులను, పద్మశ్రీ పొందిన వ్యక్తి. శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు కు వారి అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
