NTV Telugu Site icon

Bandi Sanjay: నేడు కరీంనగర్‌ కు కేంద్రమంత్రి బండిసంజయ్‌.. షెడ్యూల్‌ ఇదీ..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇవాళ కరీంనగర్ వస్తున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమర్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికనున్నారు. తొలిరోజు ఉదయం 9 గంటలకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని శనిగరం వద్దకు చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం వారితో కలిసి కరీంనగర్ చేరుకుని నేరుగా మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం చైతన్యపురిలోని తన నివాసానికి వెళ్లి మాతృమూర్తి ఆశీస్సులు తీసుకుంటారు. అక్కడి నుండి నేరుగా కొండగట్టు బయలుదేరి వెళతారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తనను కలిసేందుకు వచ్చిన చొప్పదండి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో గడుపుతారు.

Read also: Hyderabad Murder : ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని దారుణ హత్య.. మరొకరికి గాయాలు..

అనంతరం నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు వేములవాడ శ్రీరాజశ్రీరాజేశ్వర ఆలయానికి విచ్చేస్తారు. ఎములాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కలిసి ముచ్చటిస్తారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు సిరిసిల్ల నియోజక కేంద్రానికి వెళతారు. పట్టణంలోని మార్కండేయ దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించడంతోపాటు తనను కలిసేందుకు వచ్చిన సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటారు. ఆ తరువాత నేరుగా కరీంనగర్ బయలుదేరి వెళతారు. రేపు (జూన్ 20) మధ్యాహ్నం వరకు కరీంనగర్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

Read also: Tirumala: నడక మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్

సాయంత్రం హైదరాబాద్ వెళ్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎల్లుండి (ఈనెల 21న) బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రసిద్ది చెందిన దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. తిరిగి రాత్రి కరీంనగర్ చేరుకుంటారు. అనంతరం ఈనెల 22న కరీంనగర్ పట్టణంలోని శివాలయం, రామేశ్వరాలయం, భగత్ నగర్ అయ్యప్ప ఆలయాలను సందర్శించడంతోపాటు స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈనెల 24 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 23న ఢిల్లీ పయనమమవుతారు.
Hajj 2024: హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు మృతి