Site icon NTV Telugu

రేపు గజ్వేల్ లో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష

సిద్దిపేట జిల్లా : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో రేపు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేయనున్నారు.. ఈ సందర్భంగా గజ్వేల్‌ మండలం అనంతరావు పల్లి లో ఆరు నెలల క్రితం ఉద్యోగం రాలేదని మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్న కొప్పు రాజు కుటుంభ సభ్యులను పరామర్శించనున్నారు వైఎస్ షర్మిల. పరామర్శ అనంతరం గజ్వేల్‌ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో నిరోద్యోగ దీక్షలో పాల్గొననున్నారు వైఎస్. షర్మిల. అయితే… వర్షం కారణంగా దీక్ష స్థలంపై ఇంకా క్లారీటీ రాలేదు. సాయంత్రం లోగా దీక్ష స్థలం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version