NTV Telugu Site icon

Students Clash for Girl: ఔను.. ఆ అమ్మాయి కోసం వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు

Students Clash For Girl

Students Clash For Girl

Students Clash for Girl: ఒక అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. కాళ్లతో, కట్టెలతో దారుణంగా కొట్టుకున్నారు. ఈ వ్యవహారం అంతా ఒక బస్టాండ్‌ లో జరగడం విమర్శలకు తావులేపుతుంది. విద్య అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన విద్యార్థులు కన్నుమిన్ను తెలికుండా బస్టాండులో దారుణంగా కొట్టుకోవడంపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది. ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్చాయిలు కొట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. ఆ అమ్మాయి నాదంటే నాది అంటూ ఒకరినొకరు బస్టాండ్‌లో జనం వున్నారనేది కూడా మరిచి, అక్కడున్నవారిపై కూడా పడుతూ.. సినిమా తరహాలో ఒకరినొకరు కొట్టుకున్నారు. కట్టె తీసుకుని మరీ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. కాళ్లతో కడుపుపై కొట్టుకుంటూ ఆవేశంతో ఊగిపోయారు యువకులు. సినిమాల ప్రభావం జీవితాలను మార్చేస్తాయంటే ఈ ఘటనే నిదర్శనం అని చెప్పొచ్చు. ఇదంతా వరంగల్‌ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకుంది.

వరంగల్‌ జిల్లా నర్సంపేటలో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఓకేషనల్ కాలేజ్ లో చదువుకుంటున్న విద్యార్థులకు ఒకే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. కానీ.. ఆ అమ్మాయి నాదంటే నాదని ఇద్దరు విద్యార్థులు ఒకనొకరు వార్నింగ్‌ ఇచ్చుకున్నారు. అమ్మాయితో మాట్లాడితే ఏంచేయడానికైనా సిద్దమంటూ హెచ్చరించుకున్నారు.ఈనేపథ్యంలో గత రెండురోజుల క్రితం కత్తులతో ఘర్షణకు కూడా దిగారు. అయితే ఆ సమయంలో.. పోలీసుల ఎంట్రీతో ఇరువురు పారిపోయారు. కానీ విద్యార్థులపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. విద్యార్థుల ఘర్షణను లైట్ తీసుకున్నారు. ఇదే అలసుగా తీసుకున్నా విద్యార్థులు ఇవాళ మళ్లీ బస్టాండ్‌లో ఒకరొనొకరు కొట్టుకున్నారు. బస్టాండ్‌లో వున్నవారు భయాందోళనకు గురయ్యారు. వారిమీద ఎక్కడ దాడి జరుగుతుందో అంటూ అక్కడినుంచి పక్కకు వెళ్లి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. దీంతో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈవీడియో తీసిన కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ గా మారింది. మొదటి సారే కత్తులతో దాడికి పాల్పడినప్పుడే విద్యార్థులపై చర్యలుతీసుకొని వుంటే ఇప్పుడు మళ్లీ ఘర్షణ జరిగి వుండేది కాదని స్థానికులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారా? మొదటి సారి లైట్ తీసుకున్నట్లే ఈసారికూడా పట్టించుకోరా? అంటూ సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Golla BabuRao: పాయకరావుపేటలో వైసీపీ పంచాయతీ