NTV Telugu Site icon

Thummala Nageswara Rao: కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట కఠినం..! కానీ..

Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

Thummala Nageswara Rao: కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట కఠినం కానీ పనిమంతుడని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా కేంద్రంలోని సీపీఐఎంఎల్ ప్రజా కార్యాలయానికి వెళ్లి నేతలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మాట్లాడారు. ఆర్ అండ్ బీ ఆయన వద్ద ఉంది.. కాబట్టి మా జిల్లా రహదారులను అభివృద్ధికి సహకరించాలన్నారు. కొత్తగూడెం నుంచి వెలిగొండ రోడ్ కూడా మీరే పూర్థి చేయాలన్నారు. ఖమ్మంలో ఒకప్పుడు సెంటిమీటర్ నేషనల్ హైవే ఉండేది కాదన్నారు. ఇరిగేషన్ పనులు కూడా అందరం కలిసి పూర్తి చేసుకోవాలన్నారు. పాలనలో అవలక్షణాలు వచ్చాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి గత కొంత కాలంగా ఆగిపోయిందన్నారు. మళ్లీ అభివృద్ధి పనులు చేసుకుందామని పిలుపునిచ్చారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పరిపాలన సాగిస్తుందని తుమ్మల అన్నారు.

Read also: Ram Charan: ‘క్లింకార’తో చరణ్-ఉపాసన మొదటి క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు మెజారిటీ గిరిజనులు మౌలిక వసతుల కల్పనకు సహకరించారని గుర్తు చేశారు. ఇప్పుడు మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చిందని, గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గత పాలకులు అవలంభించిన ప్రతిపక్ష విధానానికి స్వస్తి పలికి ఎన్నికల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు నా గెలుపునకు కృషి చేసిన సంగతి ఎప్పటికీ మరువలేనని అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రజాపంథా నాయకులు పోటు రంగారావు, మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
Vyooham Movie: వ్యూహం సినిమాను ఆపకపోతే.. సైకో వర్మ కార్యాలయం, ఇంటిని ముట్టడిస్తాం!