NTV Telugu Site icon

TSRTC: ప్రైవేట్ పెట్రోల్ బంకుల వ‌ద్ద క్యూ క‌డుతున్న ఆర్టీసీ బ‌స్సులు…

తెలంగాణ ఆర్టీసీని డీజిల్ కొర‌త వేధిస్తున్న‌ది. గ‌తంలో ప్ర‌భుత్వం డీజిల్‌పై రూ. 7 రూపాయ‌లు స‌బ్సీడీ ఇస్తున్న‌ది. డీజిల్‌పై స‌బ్సిడీ రావడంతో ఆర్టీసీ పెద్ద ఎత్తున డీజిల్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఫిబ్ర‌వ‌రి 16 నుంచి ఈ స‌బ్సిడీని ప్ర‌భుత్వం ఎత్తివేసింది. స‌బ్సిడీని ఎత్తివేయ‌డంతో తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రైవేట్ బంకుల‌ను ఆశ్ర‌యించారు. ప్రైవేట్ పెట్రోల్ బంకుల్లో డీజిల్‌ను ఫిల్ చేయిస్తున్నారు. ఖ‌మ్మం డిపో నుంచి పెద్ద సంఖ్య‌లో ఆర్టీసీ బ‌స్సులు ప్రైవేట్ బంకుల వ‌ద్ద క్యూలు క‌డుతున్నాయి.

Read: Valimai Pre Release Event : ‘భీమ్లా నాయక్’పై కార్తికేయ కామెంట్స్

ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేర‌కు ప్రైవేట్ బంకుల్లో డీజిల్‌ను కొనుగోలు చేస్తున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు. డిపోల నుంచి బ‌స్సుల‌ను ప్రైవేట్ బంకుల వ‌ద్ద‌కు త‌ర‌లించ‌డం ఇబ్బందిగా ఉంద‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాతో పాటు ప‌లు జిల్లాల్లో ఇదేవిధ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.