Site icon NTV Telugu

Biometric in Police Written Exam: హాల్‌టికెట్‌పై ఫొటో వుంటేనే..! ఇవి మీతో ఉండకూడదు..?

Biometric In Police Written Exam

Biometric In Police Written Exam

పోలీస్‌ నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాతపరీక్షకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలుచేయనున్నారు. వచ్చే నెల ఆగస్టు 7న ఎస్సై అభ్యర్థులకు ప్రాథమిక రాతపరీక్ష జరగనుండటంతో ఆయా పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే.. అభ్యర్థులు వాటిలో తమ వేలిముద్రలను నమోదుచేయాల్సి ఉంటుంది. కాగా.. 554 ఎస్సై పోస్టుల కోసం జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2,47,217 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 503 పరీక్ష కేంద్రాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 35 పట్టణాల్లో సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) శుక్రవారం వెల్లడించింది. బయోమెట్రిక్‌ నేపథ్యంలో అభ్యర్థులు చేతివేళ్లకు మెహిందీ, టాటూలు లేకుండా చూసుకోవడం తప్పనిసరని మండలి ఛైర్మన్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పరీక్షను ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. అయితే.. అభ్యర్థులను గంట ముందే కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషమైనా అనుమతించరు.

read also: Karnataka: ఇక ఎన్ కౌంటర్లే అంటూ.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు

హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో ఉంటేనే అనుమతి..
పరీక్ష రాయవలసిన అభ్యర్థులు హాల్‌టికెట్లను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌ www.tslprb.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నేటి నుంచి (జులై 30)న ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 5న రాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హాల్‌టికెట్లను ఏ4 సైజ్‌ లోనే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అయితే.. పరీక్ష నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని మరో పేజీలో కాకుండా అదే కాగితంపై వెనకవైపు ప్రింటవుట్‌ తీసుకోవాలి. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సరిపోతుంది. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌లోని నిర్దేశిత స్థలంలో అభ్యర్థి ఫొటోను అతికించుకోవాలి. ఈనేపథ్యంలో.. దరఖాస్తు చేసిన సమయంలో డిజిటల్‌ కాపీలో ఉంచినటువంటి ఫొటోనే తిరిగి వినియోగించాలి. అయితే.. దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్‌లు కొట్టొద్దు. దానికి ఫొటో లేకుంటే పరీక్షకు అనుమతించరు. కానీ.. ఒకవేళ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏవైనా సమస్యలుంటే 93937 11110 లేదా 93910 05006 నంబర్లకు కాల్‌చేసి నివృత్తి చేసుకోవచ్చు. లేదా support@tslprb.in కు మెయిల్‌ పంపి సహాయం పొందొచ్చు.

Read also: Jail Term: శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా నాలుగేళ్లపాటు జైల్లోనే. అసలేం జరిగింది?

సూచనలు..
పరీక్ష రాసే అభ్యర్థులు సెల్‌ఫోన్‌, టాబ్లెట్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌ డివైజ్‌, చేతిగడియారం, కాలిక్యులేటర్‌, లాగ్‌టేబుల్‌, వాలెట్‌, పర్స్‌, నోట్స్‌, చార్ట్‌, రికార్డింగ్‌ పరికరాలు, ఖాళీపేపర్లను వెంట తీసుకెళ్లరాదు. నగలు, హ్యాండ్‌బ్యాగ్‌, పౌచ్‌ తీసుకురావద్దు. ఎందుకంటే అవి భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి క్లాక్‌రూంలు ఉండవు. పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌పాయింట్‌ పెన్నులను మాత్రమే లోనికి తీసుకెళ్లాలి. అయితే.. ఓఎంఆర్‌ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు. దీంతో.. పరీక్షలో నెగెటివ్‌ మార్కులున్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు టిక్‌ చేయాల్సి ఉంటుంది. అయితే.. పరీక్షపత్రం బుక్‌లెట్‌లో ఇంగ్లిష్‌-తెలుగు, ఇంగ్లిష్‌-ఉర్దూ భాషలో ప్రశ్నలు ఉంటాయి, అయితే.. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలుంటే ఇంగ్లిష్‌ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలి.

Karnataka: ఇక ఎన్ కౌంటర్లే అంటూ.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version