NTV Telugu Site icon

TG TET 2024 Results: రేపు తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల..

Tg Tet Results

Tg Tet Results

TG TET 2024 Results: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2024 ఫలితాలను రేపు (జూన్ 12న) ప్రకటించనున్నారు. టెట్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీ ఇప్పటికే విడుదల కాగా, అభ్యంతరాలను స్వీకరించి తుది సమాధాన కీని సిద్ధం చేసింది. రేపు ఫైనల్ ఆన్సర్ కీతో పాటు ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో తొలిసారిగా ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈసారి టెట్ పరీక్షలకు 2,86,381 మంది దరఖాస్తు చేసుకోగా.. వారం రోజుల్లో 2,36,487 మంది పరీక్షలకు హాజరయ్యారు.

Read also: TS EdCET Results 2024: నేడు ఎడ్‌సెట్‌ ఫలితాల విడుదల..

ఇక పేపర్-1కి 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86.03 శాతం మంది హాజరయ్యారు. పేపర్-2కు 1,86,423 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 82.58 శాతం మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో టెట్ పరీక్షకు మంచి డిమాండ్ ఉంది. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) రాయాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. అందుకే B.D., D.Ed పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడానికి ప్రతిసారీ పెద్ద సంఖ్యలో పోటీపడతారు. మరోవైపు ఎన్నికలకు ముందు టెట్ పరీక్షను నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఫలితాలను ప్రకటించలేదు.
Telangana: రాష్ట్రవ్యా ప్తంగా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై స్పెషల్ డ్రైవ్.. ఎప్పటి నుంచి అంటే..