TS RTC: తెలంగాణ విద్యార్థులంతా టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇప్పటికే విద్యార్థులకు అందుబాటులోకి రకా రకాల బస్ పాస్ లు అందజేస్తుండగా.. అధికారులు రాయితీపై బస్ పాస్ లను కూడా అందజేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో అనేక వేల మంది విద్యార్థులు బస్‌పాస్‌లతో ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ విద్యార్థులంతా ప్రతినెలా బస్ పాస్ రెన్యువల్ చేసుకోవాలంటే.. పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. కేంద్రాల ముందు గంటల తరబడి లైన్లు బారులు తీరుతున్నాయి. అయితే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ఆర్టీసీ అధికారులు పాస్‌ల రెన్యూవల్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇక నుంచి విద్యార్థులు తమ పాస్‌లను ఆన్‌లైన్‌లో పునరుద్ధరించుకోవడమే కాకుండా కొత్త పాస్‌ల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఎలా చెయ్యాలి..? ఆర్టీసీ అధికారులు అందించిన ఈ కొత్త సౌకర్యాన్ని https://online.tsrtcpass.in వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చు.
Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ముందుగా.. టీఎస్ ఆర్టీసీ వెబ్‌సైట్‌కి లాగిన్ అయి.. అప్లై బటన్‌పై క్లిక్ చేసి.. డిస్ట్రిక్ట్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత, పాఠశాల విద్యార్థుల కోసం పాస్‌లు ఎంపికను ఎంచుకుని, వర్తించు బటన్‌ను క్లిక్ చేయండి. తర్వాత.. ఓపెన్ అయ్యే పేజీలో.. రూల్స్ చదివిన తర్వాత అప్లై బటన్ పై క్లిక్ చేస్తే.. బస్ పాస్ దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. తర్వాత.. అందులో విద్యార్థుల వివరాలు, చిరునామా, పాఠశాల, రూట్ వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత డ్రాప్-డౌన్ మెను నుండి “పే మోడ్, పాస్ కలెక్షన్” ఎంచుకోండి. నమోదు చేసిన వివరాలను మరోసారి ధృవీకరించి, సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు బస్ పాస్ చెల్లించాలి. డబ్బులు చెల్లించిన తర్వాత.. టీఎస్ ఆర్టీసీ బస్ పాస్ మంజూరు చేస్తారు. అయితే.. ఆ అప్లికేషన్లు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాస్ ఎప్పుడు వస్తుందో కూడా అందులో ఉంటుంది.
Multibagger Stock: 1200శాతం పెరిగిన టాటా కంపెనీ షేర్లు.. కొన్నవాళ్లు కోటీశ్వరులు కావడం ఖాయం
