Site icon NTV Telugu

TS Inter results: ntvtelugu.com లో ఇంటర్ ఫలితాలు

Ts Inter Result

Ts Inter Result

TS Inter Results: ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణ విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎందురుచూస్తున్న సమయం రానే వచ్చింది. తెలంగాణ ఇంటర్మీడియట్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల వెల్లడిపై బోర్డు అధికారులు నిన్న టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సంప్రదించిన అనంతరం ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు నేడు ntvtelugu.com వెబ్‌ సెట్‌లో, ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా వేగంగా ఫలితాలు పొందవచ్చు.

ఇంటర్‌బోర్డు పరీక్ష పత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినా, వీలు కాకపోవడంతో ఆఫ్‌లైన్‌ ద్వారా మూల్యాంకనం చేపట్టింది. పలు దఫాలుగా ట్రయల్‌రన్‌ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జీరో సాంకేతిక సమస్యలు వచ్చాయని, దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే నేడు ఫలితాలు వెల్లడించేందుకు అంతా సిద్ధం చేశారు.

Read also: Priyadarshi : ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డు అందుకున్న ప్రియదర్శి

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకూ జరిగిన సంగతి తెలిసిందే. ఫస్టియర్ పరీక్షలకు 4,82,501 మంది విద్యార్ధులు హాజరయ్యారు. సెకండియర్ పరీక్షలకు 4,23, 901 మంది విద్యార్ధులు హాజరయ్యారు. దాదాపు 9.06 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలోనే పూర్తయింది. ఫలితాలు విడుదల చేయనుండడంతో విద్యార్ధుల్లో ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version