NTV Telugu Site icon

TG EdCET Results 2024: నేడు ఎడ్‌సెట్‌ ఫలితాల విడుదల..

Ts Edcet Results 2024

Ts Edcet Results 2024

Tg EdCET Results 2024: తెలంగాణలోని బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీఎస్‌ఈడీసెట్-2024 పరీక్ష ఫలితాలు ఈరోజు ప్రకటించనున్నారు. చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడతాయి. అభ్యర్థులు అవసరమైన వివరాలను నమోదు చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఎడ్‌సెట్ ర్యాంక్ కార్డ్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read also: Telangana: స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై స్పెషల్ డ్రైవ్.. ఎప్పటి నుంచి అంటే..

TGEDSET-2024 ప్రవేశ పరీక్షను మే 23న కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

Read also: Loksabha speaker: కేంద్రంలో కాబోయే లోక్‌సభ స్పీకర్‌ ఎవరు..?

మొదటి సెషన్‌లో 16,929 మంది అభ్యర్థులకు 14,633 మంది, రెండవ సెషన్‌లో 16,950 మందికి 14,830 మంది హాజరయ్యారు. మొత్తం హాజరు 87%. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఈ ఏడాది ఎడ్సెట్ పరీక్షల బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల BEd (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సులో ప్రవేశాలు EDSET ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించబడతాయి. రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో మొత్తం 14285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఎడ్సెట్ పరీక్షకు 27,495 మంది హాజరుకాగా.. 26,994 మంది అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణులయ్యారు.
Kalki 2898 AD : కల్కి నార్త్ అమెరికా ప్రీ సేల్స్ అదిరిపోయాయిగా..