పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులు పూర్తి చేసిన వారికి నేరుగా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ పరీక్ష నేడు జరగనుంది. రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సివిల్, మెకానికల్, కెమికల్, మైనింగ్, మెటలర్జీ, ఫార్మసీ, బీఎస్సీ గణితం అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తార అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు https://ecet.tsche.ac.in/ సంప్రదించాలని సూచించారు.
అయితే..ఈ పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 24,055 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.. మొత్తం 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ ప్రవేశ పరీక్ష జులై 13న జరగాల్సి ఉన్నది. అయితే రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి (TSCHE) వాయిదావేసింది. దీంతో.. మారిన తేదీలతో మరోసారి హాల్‌టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్షను జేఎన్‌టీయూ హెచ్ నిర్వహిస్తుంది.
read also: LPG Cylinder Price: గుడ్ న్యూస్.. తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
ఇవాళ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు నేటి నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఫస్టియర్కు ఉ.9 నుంచి మ.12 వరకు, సెకండియర్కు మ. 2.30 నుంచి సా.5.30 వరకు పరీక్షలుంటాయి. టెన్త్ విద్యార్థులకు ఉ.9.30 నుంచి మ.12.45 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆగస్టు 10 వరకు పరీక్షలు జరగనున్నాయి.
Chikoti Praveen: నేడు ED ముందుకు ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి.. సీనీ ఇండస్ట్రీ, రాజకీయ నేతల్లో గుబులు