Cancelled Trains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. వర్షాలు, వరదల ముప్పు పెరుగుతోంది.. దీంతో వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం, అధికారులు సహాయక చర్యలకు సిద్ధమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు, రైలు పట్టాలు చెరువులుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే 20 పైగా రైళ్లను రద్దు చేసిన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కొన్నింటిని దారి మళ్లించడంతో పాటు మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేసింది.
Read also: School Holiday: భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు..
రద్దైన రైళ్ల వివరాలు..
* విజయవాడ – సికింద్రాబాద్
* సికింద్రాబాద్ – విజయవాడ
* గుంటూరు – సికింద్రాబాద్
* సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్
* కాకినాడ ఫోర్ట్ – లింగపల్లి,
* గూడూరు – సికింద్రాబాద్,
* భద్రాచలం – బల్హర్ష
* బల్హర్ష- కాజీ పేట్
* భద్రాచలం – సికింద్రాబాద్
* సికింద్రాబాద్ – భద్రాచలం
* కాజీ పేట – డోర్నకల్
* హైదరాబాద్ – షాలిమర్
* సికింద్రాబాద్ – విశాఖ పట్నం
* విశాఖ పట్నం – సికింద్రాబాద్
* హౌరా – సికింద్రాబాద్ ,
* సికింద్రాబాద్ – తిరువనంతపురం ,
* తిరువనంతపురం – సికింద్రాబాద్ ,
* మహబూబ్ నగర్ – విశాఖ పట్నం,
* లింగంపల్లి – CMT ముంబాయి,
* CMT ముంబాయి – లింగంపల్లి,
* కరీంనగర్ – తిరుపతి
Read also: CM Revanth Reddy: అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దు.. టెలి కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్..
ఆంధ్రపదేశ్ కు వెళ్లే రైళ్లు రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే..
భారీ వర్షాల తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తల్ల పూసలపల్లి లో వరద ఉధృతికి రైల్వే ట్రాక్, విరిగి పడ్డ సిగ్నల్ పోల్ కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ కొట్టుకు పోవడంతో సంఘమిత్ర, మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. వర్షాల కారణంగా కొన్ని రైళ్లను రద్దు మరికొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే దారి మళ్లించింది. ఏపీ కి వెళ్లే రైళ్ల సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ , సికింద్రాబాద్ , కాజీ పేట్, వరంగల్, ఖమ్మం , విజయవాడ, రాజమండ్రి లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు చేశారు.
*హైదరాబాద్ – 27782500,
*సికింద్రాబాద్ – 27768140,
*కాజీపేట – 27782660
*విజయవాడ – 7569305697
*రాజమండ్రి – 08832420541
School Holiday: భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు..