NTV Telugu Site icon

Tank Bund Traffic: ఆదివారం నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు ట్యాంక్‌బండ్‌ బంద్..

Tank Band Trafic

Tank Band Trafic

Tank Bund Traffic: ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహిస్తున్నందున ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు సాధారణ వాహనాలను ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించబోమని నగర ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌, రవీంద్రభారతి నుంచి ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ నుంచి ట్యాంక్‌బండ్‌, జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు అదనపు సీపీ వివరించారు.

Read also: New Traffic Rules: నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. అతిక్రమిస్తే అంతే సంగతి..!

జూన్ 2న హైదరాబాద్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలకు రిహార్సల్స్ జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదురుగా గన్‌పార్క్‌, ట్యాంక్‌బండ్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ తదితర ప్రాంతాల్లోని అమరవీరుల స్థూపం వద్ద వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులకు కీలక సూచనలు చేశారు. రిహార్సల్స్ జరుగుతున్న మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు గన్‌పార్క్ వైపు ట్రాఫిక్ అనుమతించబడదు. నాంపల్లి టి జంక్షన్ నుండి వచ్చే వాహనాలను రవీంద్ర భారతి వైపు కాకుండా బషీర్‌బాగ్ బిజెఆర్ విగ్రహం వైపు మళ్లిస్తారు.

Read also: Kondagattu: నేడు కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు..

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. వీవీఐపీ వాహనాలు ఉంటాయి. దీంతో సాధారణ వాహనదారులు తమ వాహనాలు వెళ్లిపోయిన తర్వాతే అనుమతించనున్నారు. CTO మరియు ప్లాజా జంక్షన్ వద్ద ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. హుస్సేన్‌నగర్ ప్రాంతంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయబడతాయి. ట్యాంక్‌బండ్‌పై సికింద్రాబాద్ వైపు వాహనాలకు అనుమతి లేదు. రాణిగంజ్ మరియు కర్బలా ప్రాంతం నుండి వచ్చే వాహనాలను అనుమతించరు. బైబిల్ హౌస్, కవాడిగూడ, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలను అమలు చేస్తూనే ట్రాఫిక్ పోలీసులు మరికొన్ని కీలక సూచనలు చేశారు. అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ కు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు.
Viswak Sen : సినిమా చూడకుండానే రివ్యూస్ ఎలా ఇస్తారు..

Show comments