NTV Telugu Site icon

Traffic pending challans: ప్రాణాలు తీస్తున్న ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు.. మీర్ చౌక్ ట్రాఫిక్ ఎస్ఐ పై చర్యలు?

Trafic

Trafic

Traffic pending challans: ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైంది. పెండింగ్ చలాన్లు కట్టలేకపోవడం బైక్‌ను స్వాధీనం చేసుకున్న మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు. దీంతో మనస్తాపానికి గురైన ఓ హమాలీ అత్మహత్యకు పాల్పడ్డాడు. మీర్‌చౌక్‌ ట్రాఫిక్‌ ఎస్సై గణేశ్‌ వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని మృతుడు సూసైడ్‌ నోట్‌ లో పేర్కొన్నాడు.

అసలేం జరిగింది..

ఉపాధి కోసం నల్గొండ జిల్లాకు చెందిన ఎల్లయ్య నగరానికి వచ్చాడు. సైదాబాద్ లోని నీలం సంజీవరెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నాడు. హమాలీ గా పని చేస్తూ ఎల్లయ్య కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. పలు చలాన్లు పెండింగ్ ఉండడంతో మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు తన బైక్ ను సీజ్ చేసుకున్నారు. అప్పు చేసి బండి కొన్నానని, అన్ని చలాన్లు కట్టలేనని వేడుకున్న మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు కనికరించలేదు. కుటుంబాన్నే పోషించలేని దీని స్థితిలో వున్న ఎల్లయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. తన మీదే కుటుంబం ఆధారపడి వున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పనికి వెళ్లాలంటే బైక్‌ మీదే వెళ్లాలి.. ఒక ఒక్కరోజు కూడా వెళ్లకపోతే కుటుంబం పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అలాంటిది ఇన్ని చలాన్లు ఎలా కట్టాలి సార్‌.. అని కాళ్లవేళ్లపడ్డాడు. ఎంత వేడుకున్న పోలీసులు కనికరం చూపలేదు. దీంతో.. గుండె భారం ఎక్కువైంది. తన కుటుంబానికి ఎలా పోషించాలి, అనే ప్రశ్నలు మొదలయ్యాయి. చలాన్ల కట్టలేని పరిస్థితి.. ఎవరికి భారం కాకుండా ఉండేందుకు చావే సరణ్యం అనుకున్నాడు. దీంతో మనస్థాపం చెంది ఇంటికి వచ్చిన అనంతరం విషం తాగిన ఎల్లయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఎల్లయ్యను హుటాహుటిన ఓవైసీ హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఎల్లయ్య మరణించాడని ధ్రువీకరించిన వైద్యులు. ఈవిషయం తెలుసుకున్న విషయం తెలుసుకున్న సైదాబాద్ , మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు. ముందుగా కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య అని చూపించే ప్రయత్నం సైదాబాద్ పోలీసులు చేసారని కుటుంబసభ్యులు ఆరోపించారు. అయితే ఎల్లయ్య రాసిన
సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. దీంతో చేసేది ఏమీలేక కేసును మార్చిన పోలీసులు. ఎల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం గుట్టుచప్పుడు కాకుండా సివిల్ పోలీస్ బందోబస్తు మధ్య డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించిన పోలీసులు. ఎల్లయ్యను వేధించిన మీర్ చౌక్ ట్రాఫిక్ ఎస్ఐ గణేష్ పై చర్యలు తీసుకోవాలని ఎల్లయ్య కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇంటి పెద్దను మాకు దూరం చేశారని, ఇప్పుడు మా కుటుంబానికి ఎవరు దిక్కు. ట్రాఫిక్‌ చలాన్ల పేరుతో పోలీసులు ఇలా వేధించడం సరికాదని మండిపడ్డారు.
Big Breaking: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. రేపు రాజధానికి రావాలని కవితకు ఈడీ నోటీసులు

Show comments