Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఈ నెల 9న వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కల్యాణానికి సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సమీపంలోని రహదారున్నీ మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆంక్షలపై భక్తులు, ప్రయాణికులు గమనించాలన్నారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఎల్లమ్మ ఆలయంలో కల్యాణోత్సవం పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని సూచించారు.
Read also: Hyderabad Rains: హైదరాబాద్ కు పొంచి ఉన్న వరుణుడి ముప్పు.. రెండు రోజులు భారీ వర్షాలు..
మళ్లింపు ఇలా..
* అమీర్‌పేట, బేగంపేట నుంచి వచ్చే వాహనాలను ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా సోనీ వైన్స్, ఉమేష్‌చంద్ర విగ్రహం మీదుగా పంపుతున్నారు.
* సనత్‌నగర్, ఫత్తేనగర్, బేగంపేట బైపాస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఆరు అడుగుల రోడ్డు, బల్కంపేట్ బతుకమ్మ చౌరస్తా నుంచి ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట మీదుగా మళ్లిస్తున్నారు.
* ఈ నెల 9న ఎల్లమ్మ కల్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ సమీపంలోని నాలుగు చోట్ల వాహనాల పార్కింగ్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహనాలను ఫతేనగర్ రైల్వే సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఇరువైపులా పార్క్ చేయాలని, బల్కంపేట్ ప్రకృతి క్లినిక్, ఎస్‌ఆర్‌నగర్‌లోని రోడ్లు మరియు భవనాల శాఖ, అమీర్‌పేటలోని శ్రీ గురుగోవింద్ సింగ్ ప్లే గ్రౌండ్స్‌లో ఉంచాలని సూచించారు.