Site icon NTV Telugu

Big News : టీపీసీసీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌..

రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేయాలన్న డిమాండ్‌తో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల ముందు ధర్నాకు తెలంగాణ పీసీసీ పిలుపు ఇచ్చింది. దీంతో పోలీసులు ముందస్తుగా కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్టు చేశారు. ఆయన నివాసం ముందు బారికేడ్లు పెట్టి.. పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ పోలీస్‌ కమిషనరేట్ వద్ద రేవంత్ ధర్నా చేయనున్నట్లు సమాచారం రావడంతో అయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

అయితే నేడు రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా నిరసన కార్యక్రమాలకు టీపీసీసీ పిలుపునిచ్చారు. దీంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలను నిరసనలు చేయకుండా పోలీసులు ఎక్కడికక్కడే హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు.

https://ntvtelugu.com/students-were-harassed-by-teachers/
Exit mobile version