Lok Sabha Results 2024: కాంగ్రెస్, బీజేపీ మధ్యే టఫ్ ఫైట్ కొనసాగుతుందని చెప్పొచ్చు. 8 స్థానాల్లో హస్తం, 7వ స్థానంలో బీజేపీ కొనసాగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి రఘువీర్ రెడ్డి 2 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ ముగిసేసరికి ఆయన 5,094 ఓట్లతో లీడ్‌లో కొనసాగుతున్నారు.
గోమాసె శ్రీనివాస్ (BJP)-18,401 ఓట్లు, కాగా.. గడ్డం వంశీకృష్ణ (CONG)-23,495 ఓట్లు, కొప్పుల ఈశ్వర్ (BRS)-9,312 ఓట్లు నమోదయ్యాయి. భువనగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉండగా.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో చామల రేసులోకి వచ్చింది. తొలి రౌండ్ ముగిసేసరికి 9,800 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 29,783 ఓట్లు రాగా, బీజేపీకి 19,983 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 15,361 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ ఫలితాల్లో బీఆర్ఎస్ రేసులోకి దిగింది. మెదక్ లోక్ సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్‌ఎస్ 1, ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
