సెనెట్‌లో బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం.. మండిపడిన ఎలాన్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ పాలకవర్గం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడమే దీనికి ప్రధాన కారణం. తాజాగా ఈ బిల్లుపై సెనెట్‌లో ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు మస్క్.. ఈ బిల్లు అమెరికాలోని మిలియన్ల మంది ఉద్యోగాలను నాశనం చేస్తుందని అందులో రాసుకొచ్చాడు. దీని వల్ల దేశానికి అపారమైన నష్టం కలిగిస్తుందన్నారు ఎలాన్ మస్క్.
పూర్ణచందర్‌నాయక్ నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.. స్వేచ్ఛ కూతురు సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ టీవీ యాంకర్, జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య కథనం అందరినీ కలచివేసింది. చలాకీగా, ధైర్యంగా కనిపించే ఆమె ఇలా అనూహ్యంగా జీవితాన్ని ముగించుకుంటారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అయితే ఈ విషాద ఘటన వెనుక గల అసలు కారణాలపై ఇప్పుడు ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వేచ్ఛ కుమార్తె , ఆమె తండ్రి శంకర్ మీడియాతో మాట్లాడారు. స్వేచ్ఛ కుమార్తె ఎన్టీవీతో చెప్పిన వివరాల ప్రకారం.. పూర్ణచందర్ నాయక్ గత మూడేళ్లుగా తమ తల్లి స్వేచ్ఛను వెంటాడుతూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. తనపై కూడా అతడి ప్రవర్తన అసభ్యంగా ఉండేదని, కష్టమైన రీతిలో శారీరకంగా హద్దులు దాటి ప్రవర్తించేవాడని చెప్పింది. పూర్ణచందర్ నాయక్ ఎప్పుడూ ఆమెను తల్లి దగ్గరకు వెళ్లనివ్వకుండా అడ్డుపడేవాడని, తమ తల్లి మానసికంగా బాగా కుంగిపోయిందని తెలిపింది.
కృష్ణా నదికి భారీ వరద.. జూరాల ప్రాజెక్టులో 12 గేట్లు ఎత్తి నీటి విడుదల
ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో తెలంగాణలో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చుండగా, 1,44,076 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.200 మీటర్ల వద్ద కొనసాగుతోంది. దీనివల్ల దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి ప్రవాహం గణనీయంగా పెరిగింది.
పోలీసులను అడ్డం పెట్టుకొని జేసీ రాజకీయాలు చేస్తున్నాడు..
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఏడాది తర్వాత తాడిపత్రి పట్టణంలోకి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశించాడు. కేతిరెడ్డి హఠాత్తుగా తన సొంత ఇంట్లో ప్రత్యక్షం కావడంపై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉంది. కానీ, న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంతో ఇటీవలే కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు ఆయన. మరోవైపు తాడిపత్రికి పెద్దారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జేసీ వర్గీయులు.
ప్రతిపక్ష బాధ్యత మరిచి రాష్ట్రానికి నష్టం చేస్తోంది బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రానికి తగినదే కాకుండా, నష్టం కలిగించే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్షం తన పాత్రను వదిలి, శత్రుదేశంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇవాళ గాంధీభవన్‌లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన సమయంలో బీఆర్ఎస్ మాత్రం కేంద్రంలోని బీజేపీతో ఢిల్లీలో మైత్రీ, రాష్ట్రంలో పట్టు పోట్లుతో ఉన్నట్టు బిహేవ్ చేస్తోందని విమర్శించారు. “తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేసారు?” అని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. ప్రజలకు నష్టమే కలిగించినందుకు ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చాయన్న మంత్రి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు పూర్తిగా ఖండిస్తారని వ్యాఖ్యానించారు.
టీడీపీ ఎప్పుడూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెయ్యదు
టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధి పేరుతో రాజకీయాలు మర్చిపోయాం.. దీంతో మనపై దుష్ప్రచారం చేశారు.. అందుకే ప్రతి ఇంటికి వెళ్లి ఏమి చేశామో చెప్పాలి అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు వివరించాలి.. గతంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.. కానీ, గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు.. కనీసం కేంద్ర పథకాలు కూడా ఉపయోగించలేదు.. ప్రస్తుతం మనం విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగు వేస్తున్నాం.. అన్ని చేశామని చెప్పడం లేదు.. అందుకే తొలి అడుగు అన్నాము.. రాష్ట్రంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని సహకరించారు అని చంద్రబాబు తెలిపారు.
ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. గుండిచా ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా.. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారు ప్రేమకాంత మొహంతి, బసంతి సాహూ, ప్రభాతి దాస్ గా అధికారులు గుర్తించారు. అయితే, శనివారం రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారద బలి దగ్గరకు చేరుకున్నాయి. ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూసేందుకు భక్తులు గుండిచా టెంపుల్ వద్దకు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో చెక్క దుంగలను మోసుకెళ్లే రెండు ట్రక్కులు రద్దీగా ఉన్న ఏరియాలోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
తాడిపత్రిలో తీవ్ర ఉత్కంఠ.. ఏడాది తర్వాత ఇంటికి చేరిన కేతిరెడ్డి అరెస్ట్
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఏడాది తర్వాత తాడిపత్రి పట్టణంలోకి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశించాడు. కేతిరెడ్డి హఠాత్తుగా తన సొంత ఇంట్లో ప్రత్యక్షం కావడంపై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉంది. కానీ, న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంతో ఇటీవలే కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు ఆయన. మరోవైపు తాడిపత్రికి పెద్దారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జేసీ వర్గీయులు.
నేను **సెక్సువల్.. షాకింగ్ విషయం బయట పెట్టిన ఫిదా నటి
టాలీవుడ్ కాంట్రవర్శీ యాక్టర్స్‌లో గాయత్రి గుప్త ఒకరు. ఫిదా, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీత ఆన్ ది రెడ్, బుర్రకథ వంటి చిత్రాల్లో లిమిటెడ్ రోల్స్ చేసిన గాయత్రి గుప్తా.. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూలోనూ.. బిగ్ బాస్ షో బాగోతం పైన నోరు విప్పి హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫెమినిజం, పురుషాధిక్యత, వస్త్రధారణ తదితర విషయాల్లో కూడా తన వాయిస్‌ని గట్టిగా వినిపిస్తూ.. ఎవడు ఏమనుకుంటే నాకేంటి? నాకు నచ్చినట్టు నేనుంటే తప్పేంటి? అన్న శైలిలో స్పందిస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో భాగంగా షాకింగ్ విషయాలు బయట పెట్టింది గాయత్రి గుప్తా..
