NTV Telugu Site icon

Traffic Diversion: నేడు వైన్‌ షాపులు బంద్‌.. ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే?

Trafic Divierstion

Trafic Divierstion

Traffic Diversion: ఇవాళ నగరంలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు 24 గంటలపాటు మూసివేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు భారీగా శోభయాత్ర, ర్యాలీ నిర్వహించనున్నారు. అంతేకాకుండా శోభయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ మేరకు ట్రాఫిక్ డైవర్షన్ పై రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డైవెర్షన్ రూట్ లో వెళ్లాలని సూచించారు. ఇవాళ ఉదయం 11:30 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవెర్షన్స్ ఫాలో కావాలని సీపీ తెలిపారు. హనుమాన్ శోభయాత్ర సదర్భంగా నగరంలో మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని ఉత్తర్వులు జారీచేశారు. కాదని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటి 23 నుంచి ఉదయం 11.30 గంటల నుంచి రేపు 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read also: Salman Khan Firing: కాల్పుల కేసులో తుపాకీ దొరికింది.. రంగంలోకి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్!

హనుమాన్ విజయయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టారు. పలు కూడళ్లలో 44 చోట్ల డైవెర్షన్ ప్రాంతాలు తెలిపారు. గౌలిగూడ రామ మందిరం నుండి ప్రారంభమై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్‌కి వెళ్తుందని, గౌలిగూడ రామ మందిరం నుండి మొదలై పుత్లీబౌలీ క్రాస్ రోడ్స్, ఆంధ్రబ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, డీఎం అండ్ హెచ్ఎస్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామకోటి క్రాస్ రోడ్స్ ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా.. కాచీగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ YMCA, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, వైశ్రాయ్ హోటల్ వెనకవైపు, ప్రాగా టూల్స్, కవాడీగూడ, CGO టవర్స్.. బన్సీలాల్ పేట్ రోడ్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయినీ మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాలపేట్ పీఎస్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, CTO జంక్షన్.. లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపెరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్, తాడ్ బండ్ హనుమాన్ ఆలయం దగ్గర లెఫ్ట్ టర్న్ దిశగా ఈ హనుమాన్ శోభాయాత్ర సాగనుంది.

Read also: Yuzvendra Chahal-IPL: ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి బౌలర్‌గా చహల్‌ అరుదైన రికార్డు!

సుమారు 12 కిలోమీటర్లు మేర హనుమాన్ శోభయాత్ర… ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర పోలీసు భద్రత, గస్తీ, సీసీ కెమెరాల కనుసన్నల్లో రాత్రి 8 గంటలకు వరకు హనుమాన్ శోభ యాత్ర జరగనుంది. పర్వదినాలు పండుగ రోజుల్లో రాష్ట్రంలో మద్యం షాపులు, ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. పర్వదినాలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా ఉండటంతో ఎలాంటి వివాదాలు, మతపరమైన ఘర్షణలకు తావు ఉండకూడదని పోలీసులు ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు శాఖ సూచించింది.
Astrology: ఏప్రిల్ 23, మంగళవారం దినఫలాలు

Show comments