Jaggareddy: సీఎం కేసీఆర్ కి లేఖలు పంపితే కూడా కనీసం రిప్లై రావడం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. మనిషినీ బతికించే ఆలోచన చేయండని విమర్శించారు. ఆరోగ్య శ్రీ మీద చిన్న చూపు చూస్తున్నారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. 10 లక్షల బిల్లు అయితే cmrf కేవలం 30 వేలే ఇస్తున్నారని స్పష్టం చేశారు. అసలు ఈవిషయాలు కేసీఆర్ దృష్టికి వెళ్తున్నాయో.. లేదో.. అర్దం కావడం లేదని అన్నారు. హరీష్ రావు కూడా ఆరోగ్య శ్రీ మీద దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం దగ్గర అప్పాయింట్ మెంట్ ఇవ్వట్లేదని అన్నారు. ఇచ్చినా కలిస్తే కండువాలు కప్పుడు అయితుందని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పద్దతి లేదని అన్నారు. సీఎం కి లేఖ లు పంపితే కూడా కనీసం రిప్లై రావడం లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Read also: BV Raghavulu: ఉత్తరాంధ్రలో రాజధాని వస్తే.. భూములన్నీ కబ్జా అవుతాయి..!!
షర్మిలకి నాతో పంచాయితీ ఎందొ అర్దం అవ్వడం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవ చేశారు. కేటీఆర్ కి షర్మిల కోవర్ట్ అని నిందవేశారని అన్నారు. షర్మిల వ్యవహరం చుట్టరికం తోక పట్టుకొని తిరిగినట్టు ఉందని ఎద్దేవ చేశారు. అర్జెంట్ గా షర్మిల సీఎం అయిపోవాలి అదే ఆమె కోరిక అని విమర్శించారు. విజయమ్మ కి సలహా.. జగన్ కి చెప్పి షర్మిలను సీఎం చేయండని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. మీ ఇంటి పంచాయితీ జనంకి చుట్టకండి అంటూ మండిపడ్డారు. ఏపీలో మూడు రాజధానుల పంచాయతీ.. మీ ఇంట్లో సీఎంల పంచాయితీ నడుస్తుందని విమర్శించారు. మూడు రాజధానుల బదులు మూడు రాష్ట్రాలు చేసుకోండి అంటూ ఎద్దేవ చేశారు. జగన్ మోడీకి గులాం అయ్యారు కాబట్టి మూడు రాష్ట్రాలు చేయండని జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మీ ఫ్యామిలీ అంతా మోడీ దగ్గర కూర్చొని, మూడు రాష్ట్రాలు చేసుకోండి అంతేకాని, ఊరు మీద పడతా అంటే ఎట్లా అంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి. షర్మిల పాదయాత్ర కాదు.. కాళ్ళు చేతులు కొట్టుకున్నా తెలంగాణ లో గెలవలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ అని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి.
Jaggareddy: షర్మిలకు నాతో పంచాయితీ ఏందో అర్ధం అవ్వడం లేదు