NTV Telugu Site icon

Firing in Bhadradi: భార్యను నాటు తుపాకీతో కాల్చిన భర్త.. కారణం ఇదీ..

Firing In Bhadradi

Firing In Bhadradi

Firing in Bhadradi: చిన్న చిన్న తగాదాలతో పచ్చి సంసారంలో చిచ్చురేపుతున్నాయి. సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడంతో ప్రాణాలు తీసుకుంటూ కుటుంబానికి వేదనకు గురిచేస్తున్నారు. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తి చిన్న మనస్పర్దలు ఆత్మహత్యకు దారితీస్తుంటే సహనం కోల్పోయి కొందరు చంపేందుకు వెనుకాడటం లేదు. మరొ కొన్ని చోట్ల వివాహేతర సంబంధాలు పచ్చి సంసారాలను బలిగొంటున్నాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో ఓ భర్త తన భార్యను నాటు తుపాకీతో కిరాతకంగా కాల్చి చంపిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది.

Read also: Samantha : ఆ సమయంలో దేవుడిని మనశ్శాంతిని ఇవ్వమని కోరుకున్నా…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం భోజ్జా తండా గ్రామపంచాయతీ పరిధిలోని పుల్లూరు తండాకి చెందిన లావుద్యా సమ తన భార్య శాంతి నివాసం ఉంటున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. కొద్దిరోజులు కలహాలు లేకుండా సాగిన వీరి జీవితంలో ఇద్దరి మధ్యకొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. లావుద్యా సమ రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో భర్యా శాంతి సమతో గొడవ పడేది. దీంతో లావుద్యా సమ భార్య శాంతిపై కోపం పెంచుకున్నాడు. ఆమెను చంపేందుకు ప్లాన్‌ వేసుకున్నాడు. తన వద్ద వున్న నాటు తుపాకీతో ఆమెను చంపాలని అనుకున్నాడు. ఆ సమయం రానే వచ్చింది. నిన్న రాత్రి సమ తాగి రావటంతో భార్యాభర్తల మధ్య వివాదాలు కొనసాగాయి.

ఈ నేపథ్యంలో తన భార్య సమ కిరాణా దుకాణానికి వెళ్లి వస్తుండగా రోడ్డు మీదనే నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. 108 కు కాల్ చేసి గాయపడ్డ శాంతిని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శంకర్ భార్య శాంతికి వెన్నుభాగంలో కాల్పులు జరిపాడని, దీంతో వెన్నుపూస పూర్తిగా దెబ్బతిన్నదని వైద్యులు నిర్ధారించారు. నిందితుడు శంకర్ నాటు తుపాకీతో జంతువులను వేటాడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే శాంతి పరిస్థితి విషమంగా ఉండడంతో భర్త పరారయ్యాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్నపోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో వున్న నిందితుడు సమ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Fiji Earthquake: ఫిజీలో భీకర భూకంపం.. రిక్టార్ స్కేలుపై 6.8గా నమోదు