NTV Telugu Site icon

బస్సును ఢీ కొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు..

శంషాబాద్‌ నుంచి బెంగళూరు వైపుకు వెళ్లె జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌కు చెందిన డాక్టర్‌ మరో ఇద్దరితో కలిసి జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు వెళుతున్న బస్సు డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడంతో బస్సు వెనకాల నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.

వెంటనే సమాచారం అందడంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.