NTV Telugu Site icon

Bandi Sanajay: కొనసాగుతున్న బండి ‘ప్రజాహిత యాత్ర’.. ఈరోజు ఎక్కడంటే..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanajay: కరీంనగర్ పార్లమెంట్ లో ఎంపీ బండి సంజయ్ దూకుడు పెంచారు. ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. జగిత్యాల జిల్లాల్లో రెండవ రోజు బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. కథలాపూర్ మండలం సిరికొండ నుండి చందుర్తి మండలం నర్సింగపూర్ వరకు యాత్ర ముందు సాగుతుంది. బడ్జెట్ లో హామీల అమలు కోసం కేటాయించిన నిధులు 53 వేల కోట్లు మాత్రమే అన్నారు. బడ్జెట్ సాక్షిగటా బీసీలను దారుణంగా వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయిస్తామని హామీని పూర్తిగా విస్మరించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతనేలేదన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేమని బడ్జెట్ సాక్షిగా చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పీవీ నర్సింహారావును దారుణంగా వంచించిన పార్టీ కాంగ్రెస్.. పీవీ చనిపోతే కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు కూడా జరపని నీచమైన పార్టీ కాంగ్రెస్.. పీవీ ఘాట్ ను కూల్చేస్తామని మజ్లిస్ వార్నింగ్ ఇస్తే కనీసం నోరుమెదపని పార్టీ కాంగ్రెస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ ఘాట్ పై చేయి వేస్తే దారుస్సలాంను కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చిన పార్టీ బీజేపీ అన్నారు.

Read also: Raviteja: బచ్చన్ సెట్స్ లో ఈగల్ సెలబ్రేషన్స్…

ప్రస్తుతం నలుగురు ఎంపీలను కలిగి ఉన్న కమలం పార్టీ రానున్న రోజుల్లో మరిన్ని సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. గతంలో బీజేపీ తరుపున వన్ మ్యాన్ షోగా కీలక పాత్ర పోషించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు టికెట్ ఖాయమనే ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా తన నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రజాప్రయోజన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో పార్లమెంట్‌ పరిధిలోని అభివృద్ధి పనులకు ఖర్చు చేసిన నిధులను ప్రజలకు వివరించారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో, ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు క్షుణ్ణంగా వివరించేందుకు యాత్ర చేపట్టారు. నిన్న (10వ) నుంచి 15 వరకు యాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మహాశక్తి ఆలయంలో పూజలు చేసిన అనంతరం సంజయ్ ఇంట్లో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రజాహితను ప్రారంభించిన విషయం తెలిసిందే.
Pakistan Elections: పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్, రీపోలింగ్‌కి ఆదేశం.. ఇమ్రాన్‌ఖాన్‌కి మద్దతుగా ఆందోళనలు..