Site icon NTV Telugu

Talasani Srinivas: డబుల్ బెడ్రూం ఇళ్లు అమ్ముకోవద్దు.. వాటి విలువ కోట్లలో ఉంది

Talasani Srinivas

Talasani Srinivas

Talasani Srinivas: ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లు కోటి రూపాయలు విలువ ఉంటుందని ఇక్కడి ఇల్లు ఎవరు అమ్ముకోవొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు సూచించారు. గోషామహల్ లోని ముర్లిధర బాగ్ లో ఇటీవల నిర్మించిన 120 డబల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు మంత్రులు తలసాని, మహమూద్ అలీ అందించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. జిందగీ లో ఇలాంటి ఇల్లు వస్తుంది అని ఇక్కడి స్థానిక జనం ఊహించి ఉండరని తెలిపారు. ఇక్కడి జనం పల్లు, పూవులు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు కానీ.. మీ పిల్లాలను మంచిగా చదివించండని సలహాఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ ను అద్భుతంగా రినివెట్ చేశారని వివరించారు. నరేంద్ర మోడీ ఎం ఇచ్చారో రాజా సింగ్ చెప్పాలిని కోరారు. ఇళ్లను మంచిగా మైయిన్టెన్ చేసుకోవాలని కోరారు.

గతంలో తెలంగాణ రాష్ట్రంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూం కట్టి ఇస్తాం అని హామీ ఇచ్చారని తెలిపారు. ఒక్కో డబల్ బెడ్ రూం ఇల్లు కోటి రూపాయలు విలువ ఉంటుందని, ఇల్లు ఎవరు అమ్ముకోవొద్దని సూచించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని గుర్తు చేశారు. తలసాని పెన్షన్ విషయం చెప్తున్నప్పుడు మాకు పెన్షన్ రావడం లేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహిళ ను మాట్లాడొద్దు అని పోలీసులు అపే ప్రయత్నం చేశారు. అది గమనించిన తలసాని వారికి ఆవేదనకు గురి కావద్దని సూచించారు. రాబోయే రోజుల్లో పెన్షన్ వచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఇక్కడ కట్టిన దుకాణాలు స్థానికులకే ఇవ్వాలని కోరారు. లాటరీ పద్ధతిలో దుకాణాలు ఇస్తామన్నారు. లాటరీ తీసి పలువురికి ఇళ్లను అందించారు.

హోమ్ మంత్రి మహమూద్ అలి మాట్లాడుతూ.. ఇంత మంచి డబుల్ బెడ్ రూం ఏ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్‌ లాంటి మంచి లీడర్ దేశం లోనే లేరన్నారు. 14 సంత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారని,హైదరాబాద్ చాలా డెవెలప్ అవుతుందని తెలిపారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి దేశంలో ఫ్రీ వాటర్ ఇవ్వలేదని అన్నారు. కానీ.. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫ్రీ వాటర్ ఇస్తుందని గుర్తు చేశారు. 200 ఉన్న పెన్షన్ ను 2000 చేసిన ఘనత కేసీఆర్‌ దే అన్నారు. 2014 కు ముందు అనేక గొడవలు జరుగుతుండేవని, కానీ.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు లేవు, గొడవలు లేవని అన్నారు. ప్రభుత్వంకు ఒక్కో డబల్ బెడ్ రూం ఇల్లు నిర్మించడానికి 8 లక్షలు కర్చు అయిందని ప్రజలకు వివరించారు.
Summer heat: ఎండదెబ్బకు జనం విలవిల.. వేసవి తాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి

Exit mobile version